పాదాల పగుళ్ళు…చిట్కాలు

713
- Advertisement -

ప్రతి రోజు పాదాలను గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి,పాదాల వేళ్ళమధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.

రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కొని తడిలేకుండా తుడుచుకోవాలి.

పడుకునే ముందు వాజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకొని కాటన్ సాక్స్ వేసుకొని పడుకోవాలి.

నిమ్మ రసం లో ఆముదం నూనె ,రోజ్ వాటర్ కలిపి పాదాలను శుభ్రం చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి.

పాదాలను శుభ్రంగా కడుక్కొని , ఆముదం రాసి 20 లేక 25 నిమిషాలు గోరు వెచ్చని నీటిలో నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాలు శుభ్రం అవ్వడమేకాకుండా మృదువుగా కూడా వుంటాయి.

అరటి పండు ను ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి 10 నిమిషాలు వుంచి తరువాత నీటి తో శుభ్రపరుచుకుంటే పాదాలు మెత్త బడుతాయి.

పగుళ్ల పై కొబ్బరి నూనె తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి.

పావుకప్పు బొప్పాయి, కలబంద గుజ్జుల్ని తీసుకుని రెండు చెంచాల గంధం పొడి, చిటికెడు పసుపూ, చెంచా ఆలివ్‌ నూనె కలిపి మెత్తని పేస్టులా చేసుకుని, దాన్ని పాదాలకు రాసుకొని 20లేక25 నిమిషాల తర్వాత పాదాలను గోరు వెచ్చని నీటి తో శుభ్రం చేసుకోవాలి.

Also Read:గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కొదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌

నిమ్మ తొక్కలను మెత్తగా గ్రైండ్ చేయాలి , దానిలో ఒక స్పూన్ పసుపు కలిపి రాస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.

వేపాకులను బాగా నూరి , దానిలో ఒక స్పూన్ పసుపు కలిపి పగుళ్ళు ఉన్నచోట రాయలి.

- Advertisement -