సెక్యూలర్‌ పదాన్ని తప్పుగా చెబుతున్నారు:సీతారం

213
- Advertisement -

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ఉన్న రాజ్యంగ సంస్థలను దుర్వినియోగం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జరిగిన మోర్బీ ఘటనపై జ్యూడిషియల్‌ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్‌ చేశారు.

గవర్నర్‌ వ్యవస్థను రాజకీయాలకు ఉపయోగించుకొని ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరు వల్ల దేశం ఆర్ధిక సంక్షోభంలోకి పోయిందన్నారు. ఇండస్ట్రీయల్‌ ప్రొడక్షన్‌ గణనీయంగా తగ్గిందన్నారు. దీంతో పాటు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని అసహనం వ్యక్తం చేశారు.

మతోన్మాద శక్తులను ప్రొత్సహించి రాజకీయా పబ్బం గడుపుతున్న బీజేపీ ప్రభుత్వంకు చరమగీతం పాడే అవసరం ఏర్పడిందన్నారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు, మత ఘర్షణలు విపరీతంగా పెరిగి సెక్యూలర్‌ పదాన్ని తప్పు దోవపట్టిస్తున్నారని మండిపడ్డారు.

అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోందని అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే బీజేపీని గద్దె దింపే సమయం వచ్చిందన్నారు. ప్రస్తుత తరుణంలో బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు కావాలని…దానిని ఎవరు ఏర్పాటు చేసినా దానికోసం మేం కృషిచేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి..

మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం:ఈసీ

తెల్ల దొరకు తెలుగు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్

 

- Advertisement -