హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…అన్ని ప్రతిపక్షపార్టీలు కలిసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం కల్ల అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అన్ని నష్టాలే తప్ప లాభాలే లేవని తెలిపారు. కేంద్రం ముందుగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను నిర్వీర్యం చేస్తుందని…ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు.
సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో మోడీ మోసపూరిత విధానాలు, పచ్చి అబద్దాలు చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. బీజీపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్ కు ఉందని…ఆది కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. టీఆర్ఎస్ తో పొత్తు కొనసాగిస్తూనే రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి…