స్కాంలో ఉన్న బీజేపీ నేతలు వారే: సీపీఐ రామకృష్ణ

282
cpi
- Advertisement -

ఏపీలో స్కాంలో ఉన్న బీజేపీ నేతలు విష్ణువర్దన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావులేనని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆశ్రమంతో డీల్ కుదుర్చుకుని రూ. 30 కోట్లు తీసుకున్న బీజేపీ నేతలపై ఆ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆశ్రమంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించాక.. ఆశ్రమానికి చెందినవారు బీజేపీ నేతలతో డీల్ కుదుర్చుకుని బయటపడ్డానికి ప్రయత్నించినట్లు వార్తలొస్తున్నాయని, ఆ ఇద్దరు విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావులేనని తెలుస్తోందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

అలాగే సీఎం జగన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు రామకృష్ణ. స్ధానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు వైసీపీ ఏజెంట్లలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రి అపోయింట్మెంట్ కూడా ఇవ్వలేదని..కేంద్ర మంత్రులు రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాస్ పీకారని చురకలు అంటించారు. ఈ నెల 5న జరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -