హీరో నానిని మించిపోయిన మోడీ నటన: నారాయణ

137
narayana
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు సీపీఐ నారాయరణ. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. పంజాబ్ రైతుల నిరసన పై ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ నటనలో నేచురల్ స్టార్ నాని ని మించి పోయారన్నారు.

చైనా దురాక్రమణ పై ఇప్పటి ఇరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత లోటుపాట్లు సరిడ్డుకోక పోతే ఆపార్టీకి భవిష్యత్తు ఉండదన్నారు.తెలంగాణ లో బీజేపీ నేతల అరెస్టు ద్వారా ఆ పార్టీని కేసీఆర్ మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ చర్యలు తోనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.

జనసేన పొత్తులపై చంద్రబాబు చేసిన రాజకీయ చంచలత్వానికి నిదర్శనం అన్నారు. పొత్తులపై చంద్రబాబు కు క్లారిటీ లేకపోతే టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవన్నారు. టీడీపీ తో బీజేపీ పొత్తు ఉంటే మా నిర్ణయం మేము తీసుకుంటామన్నారు.

- Advertisement -