సీఎం శివరాజ్‌ సింగ్‌పై మండిపడ్డ హరీష్ రావు..

21
harish

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. శివరాజ్ సింగ్ చేసిన ఆరోపణలు వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది అని మండిపడ్డారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం అయిన శివరాజ్‌….సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.

తెలంగాణతో‌ మీ రాష్ట్రం దేనికి పోలిక..? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించిందో చెప్పాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానంగా చెప్పారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

317 జీవో రద్దు చేయాలా‌‌… అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా…? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు హరీష్‌రావు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా..? నిరుద్యోగులకు ఉద్యోగాలు‌రావాలని సీఎం భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దను బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.