బీజేపీవి చీకటి ఒప్పందాలు..

36
cpi narayana

బీజేపీ నేతలవి చీకటి ఒప్పందాలని…వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు సీపీఐ నారాయణ. వివిధ వర్గాలకు చెందిన వారితో బీజేపీ నాయకులు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని … మురళీధర్‌రావు 3 కోట్లు ఇస్తానని మహిళను మోసం చేశారని విమర్శించారు. విష్ణువర్ధన్‌రెడ్డి రూ.30 కోట్ల బ్లాక్ మెయిల్ మోసం చేశారని మండిపడ్డారు.

మోసాలు చేసే బీజేపీ డెకాయిట్లతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసిపోయారని …. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు ఒక్క ఓటు వేసినా వృథాయేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు.

కమీషన్ల కోసమే రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ వాహనాలు కొన్నారని వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన నారాయణ…. 196, 197 జీవోలు బొత్స సత్యనారాయణ ఇవ్వలేదని తాను దుర్గగుడిలో ప్రమాణం చేయాలని బొత్సకు సవాల్ విసిరారు.