పవన్‌కు రాజకీయ స్పష్టత లేదు: సీపీఐ నారాయణ

128
cpi
- Advertisement -

పవన్ కళ్యాణ్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు…. జనసేనానిలో రాజకీయ స్పష్టత లేదని విమర్శలు గుప్పించారు సీపీఐ నారాయణ. తిరుపతిలో ఏపీ రాజకీయాలపై స్పందించిన నారాయణ…వైసీపీ నాయకుల తీరుపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు.

వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్ లో ఉన్నాయని…వారి సహజీవనం మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నాయకులు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ ఏపీకి వచ్చి శివతాండవమాడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీని వ్యతిరేకించే వారితో పొత్తులుంటుందని ….కబ్జాల నుంచి, దౌర్జన్యాల నుంచి, అరాచకాల నుంచి బయటకు రావాలని సిఎం ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో జగన్ మాటలతోనే అర్థమవుతోందన్నారు.

- Advertisement -