CPI:మోడీని ఓడిస్తేనే దేశ భవిష్యత్

19
- Advertisement -

బీజేపీ, మోడీని ఓడిస్తేనే దేశానికి భవిష్యత్ ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్న మోడీని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించి,హిమాయత్‌నగర్‌ నుంచి నారాయణగూడ వరకు ర్యాలీ నిర్వ హించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ… దేశంలోని కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులపై ఉక్కు పాదం మోపుతూ పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించాలన్నారు.

దేశ సంపదలైన సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టి గత పందేండ్లుగా కార్మిక వర్గంపై మోదీ సర్కార్‌ వేగవంతంగా దాడి చేసిందని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యతతో ముందుకు సాగి హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలని వారు పిలుపు నిచ్చారు.

Also Read:పుష్ప… ఫుల్ లిరికల్ వచ్చేసింది

- Advertisement -