- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణపై మెగా బ్రదర్ నాగబాబుతో సహా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయగా దీనిపై స్పందించారు నారాయణ.తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని…మెగా అభిమానులు ఈ వ్యాఖ్యలను మర్చిపోవాలని కోరారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైకి నటుడు చిరంజీవిని ఆహ్వానించడం పెద్ద పొరపాటని ఆయన వ్యాఖ్యనించారు. రాజకీయంలో రంగులు మార్చే చిరంజీవికి బదులుగా అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించిన నటశేఖర కృష్ణను వేదికపైకి పిలుస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు.
- Advertisement -