ప్రభాస్ ‘ప్రాజెక్టు k’ అప్‌డేట్!

90
prabhas
- Advertisement -

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే కథానాయిక కాగా, ఓ ముఖ్యపాత్రకు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీని ఎంపిక చేశారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్, హీరోయిన్ దీపికా లతో పాటు భారీ స్థాయిలో జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నారు. వీరిపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశిన్.

వచ్చే ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -