- Advertisement -
ధర్మస్థల ట్రస్ట్ వివాదంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది..ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసింది అన్నారు.
దాదాపు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారు అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి SIT వేసింది… అదే బీజేపీ సర్కార్ ఉంటే SIT ఏర్పాటు చేసేది కాదు అన్నారు.
స్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్నీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి… సీపీఐ నేత ఎంపీగా పోటీ చేయకూడని గతంలో ట్రస్ట్ సభ్యులు అడ్డుకున్నారు ..అతను తెగించి పోటీ చేసినందుకు పదిహేనేళ్ల తన కుమార్తెను రేప్ చేసి చంపేశారు అని ఆరోపించారు. ధర్మస్థల ట్రస్ట్ ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు నారాయణ.
Also Read:బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి:కేటీఆర్
- Advertisement -

