బీజేపీ వ్యతిరేక కూటమై ఉండాలి కొత్త పార్టీ :సీపీఐ నారాయణ

120
- Advertisement -

దసరా నాటికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ సూచించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్‌ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన కూటమి అవసరమన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి బలపడే విధంగా టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ అడుగులు వేస్తే మంచిదన్నారు. కేసీఆర్‌ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తుందన్నారు.

- Advertisement -