ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

28
- Advertisement -

తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా నియమితులయ్యారు సీపీ రాధాకృష్ణన్. ప్రస్తుతం జార్ఖాండ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే పుద్దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా రాధాకృష్ణన్‌కే అప్పగించారు.

ఇక తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై రిక్వెస్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు తమిళి సై. తెలంగాణ ప్రజలను వీడుతున్నందుకు బాధగా ఉన్నా తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Also Read:రోజు ధ్యానం చేస్తే ఎన్ని ఉపయోగాలు!

- Advertisement -