న్యూ ఇయర్ వేడుకలపై సీపీ హెచ్చరిక..

93
CP Anjani Kumar
- Advertisement -

నూతన సంవత్సర వేడుకలుపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యూ ఇయర్ వేడుకల్లో మైనర్లకు మద్యం అమ్మకాలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పబ్బుల యాజమాన్యాలను హెచ్చరించారు.. డిసెంబర్ 31 రాత్రి అన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, ఎవరూ మద్యం తాగి వాహనాలు నడిపినా చర్యలు తీవ్రంగా ఉంటాయని సీపీ సూచించారు.

అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తమ పిల్లలను తల్లిదండ్రులు నిగాలో చూసుకోవాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సరియైన పద్దతిలో వేడుకలు చేసుకోవాలి. ఆరోగ్య శాఖ నుండి పలు నిబంధనలు వచ్చాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు సీపీ అంజనీ కుమార్.

- Advertisement -