ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్: విద్యాశాఖ మంత్రి

27

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి కాగా, 51 శాతం మంది ఫెయిల్ కావడం పట్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.