- Advertisement -
గ్రేటర్ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని తెలిపారు సీపీ అంజనీకుమార్.గత ఏడేండ్లలో హైదరాబాద్ నగరానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు.
కొందరికి నగరం అభివృద్ధి చెందడం ఇష్టంలేదని, అందుకే విద్వేశాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటివారికి నగరంలో చోటులేదని చెప్పారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని ..అసత్యాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వారు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.
శాంతి భద్రతలు మంచిగా ఉండటం, నేరాల రేటు తక్కువగా ఉండటం, ఎలాంటి మతకల్లోలాలు లేకపోవడంతోనే బోయింగ్, యాపిల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు
- Advertisement -