చైనాలో కొత్త వేరియంట్లు…

103
corona
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మార్పులను కలిగి ఉన్న వైరస్‌లలో ఒకటిగా కరోనా ఉందని భారత కోవిడ్‌ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) ఎన్‌కే ఆరోరా తెలిపారు. చైనా, యూఎస్‌, జపాన్, కొరియా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ భారత్ అప్రమత్తమైందని అన్నారు. అయితే చైనాలో మాత్రము నాలుగు రకాల వేరియంట్లు ఉన్నాయని అన్నారు. ఇందులో ప్రస్తుతం బీఎఫ్7రకం వేరియంట్ వల్ల చైనా తీవ్రంగా నష్టపోతుందని కూడా అన్నారు.

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌7 నుంచి 10-15శాతం కేసులు ఉన్నాయని అన్నారు. అత్యధికంగా బీఎన్‌ మరియు బీక్యూ నుంచి 50శాతం కేసులు చైనాలో నమోదుఅవుతున్నట్టు తెలిపారు. భారత్‌లో ఈ దఫా కరోనా విజృంభణ చాలా వరకు ఉండదని అభిప్రాయపడ్డారు. భారత్‌లోని మొత్తం జనభాలో 90శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నవారని తెలిపారు. దీని ద్వారా మానవ శరీరంలోకి హైబ్రిడ్‌ రోగనిరోధక శక్తిని పెంపోదించినట్టు తెలిపారు.

ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఇంట్రానాసల్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభించదని త్వద్వారా బూస్టర్‌ డోసులు త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ టీకా 18యేళ్లు పైబడిన వారందరూ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ముందు జాగ్రత్తగా బూస్టర్‌ డోసులు తీసుకోవచ్చని తెలిపారు. కానీ పదే పదే డోస్‌లు తీసుకోవాల్సి వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌కే ఆరోరా చెప్పారు. బూస్టర్ డోసులు తీసుకునేవారికి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎలాంటి సూచనలు చేయలేమని చెప్పారు.

డిసెంబర్‌ 21న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో మాస్క్‌ ధరించడం చేతులు కడుక్కోవడం సామాజిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని..వాటికి అనుగుణంగా పనిచేసి కరోనాను కట్టడి చేయాలని సూచించామని ఎన్‌కే ఆరోరా అన్నారు.

ఇవి కూడా చదవండి…

నాసల్ వ్యాక్సిన్ రేటు ఎంతంటే…

కొవిడ్‌ ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌

ఒకే రోజు పదిలక్షల కేసులు

- Advertisement -