కరోనా వ్యాక్సిన్ ధరెంతో తెలుసా..?

230
corona
- Advertisement -

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రోజుకు ఇరవై లక్షలకు మందికి పైగా కరోనా టీకా వేస్తుండగా మార్చి 1 వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.

సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కేంద్రం రూ.210 కి కొనుగోలు చేస్తుండగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ను ఒక్కో డోస్ ధర రూ.250గా నిర్ధారయించింది కేంద్రం. రెండు డోసులు కలిపి రూ.500గా ఉంది.

ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఉండటంతో వ్యాక్సిన్ ధరలు తగ్గించే ఆవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా వ్యాక్సిన్ ఖరీదు తగ్గితే మరింత మంది వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

- Advertisement -