దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేయగా తాజాగా పలు రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేశాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి.
హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో బహిరంగప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరికాగా సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం.కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాలని కోరింది ప్రజలను కోరింది కేంద్రం.
కేరళ ప్రభుత్వం గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దవాఖానలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది కూడా మాస్కులు ధరించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..