పెరూలో పెరుగుతున్న మరణాల సంఖ్య..

58

దక్షిణ అమెరికా దేశమైన పెరూలో మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌త 24 గంట‌ల్లో ఆ దేశంలో కొత్త‌గా 25 మంది మ‌ర‌ణించగా ఇప్ప‌టి వ‌ర‌కు 22 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా పోలిస్తే, పెరూలో కోవిడ్ మ‌ర‌ణాల రేటు అధికంగా ఉన్న‌ది. ప‌ది ల‌క్ష‌ల మందిలో ఆ దేశంలో ఆరు వేల మంది మ‌ర‌ణిస్తున్నారు.