మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

73
Covid cases
- Advertisement -

దేశం వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలోనూ రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుంది. గడచిన 24 గంటల్లో 11,107 కరోనా పరీక్షలు నిర్వహించగా, 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,93,544 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,88,886 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 547 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

కొత్తగా నమోదైన కేసులలో హైదరాబాదులో అత్యధికంగా 55 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 2, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 1, సిద్ధిపేట జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

- Advertisement -