- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 1 నుండి 18 నుండి 45 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనుండగా నేటి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది.
ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సిన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు.
ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటించాయి. ఉత్పత్తి దారుల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అటు కేంద్రం కూడా కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా అందించబోతున్నారు.
- Advertisement -