టీకా తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి..

22
vaccination

తెలంగాణ రాష్ట్రంలో ఇక టీకా తీసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జీ శ్రీనివాస్‌రావు ప్రకటించారు. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపరు. అది కూడా 45 ఏళ్లు పైబడిన వారికేనని ఆరోగ్య శాఖ తెలిపింది. తొలి డోసు అయినా రెండో డోసైనా బుక్‌ చేసుకుంటేనే టీకా దొరుకుతుందని తేల్చిచెప్పింది.

స్లాటు బుక్‌ చేసుకోకుండా టీకా కేంద్రాల వద్దకు రావొద్దని సూచించింది. ఇప్పటికే కొవిన్‌ పోర్టల్‌లో టీకా లభించే కేంద్రాలతో పాటు అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అప్‌లోడ్‌ చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4లోపు టీకా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వ్యాక్సిన్‌ నిల్వలు తగినంతగా అందుబాటులో లేకపోవడంతోపాటు టీకా కేంద్రాల వద్ద భారీ రద్దీ నేపథ్యంలోనే వైద్యశాఖ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది.

కాగా,సోమవారం రాత్రి వరకు 4 లక్షల వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇందులో కొవిషీల్డ్‌ మాత్రమే ఉన్నట్టు అధికారులు తెలిపారు. డోసులు రావడంతో తిరిగి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. రెండో డోసు తీసుకున్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 18 ఏండ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించే విషయంపై త్వరలో స్పష్టత రానున్నట్టు పేర్కొన్నారు.