కొవిద్ – 19గా కరోనా వైరస్‌..

459
covid
- Advertisement -

కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో వ్యాపించిన ఆ మహమ్మారి ఎక్కడ తమకు అంటుకుపోతుందో అని ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం..వేల సంఖ్యలో కరోనా అనుమానితులు బయటపడుతుంటంతో అంతా భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రాణాంతక కరోనా వైరస్‌కు కొవిద్ – 19 అని నామకరణం చేశారు. ఇందులో సీఓ అంటే కరోనా, వీఐ అంటే వైరస్‌, డీ అంటే వ్యాధికి గుర్తింపుగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఇక ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 1100కి చేరుకుంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 42,638 మందికి చేరుకున్నదని అధికారులు వెల్లడించారు.

చైనా ఆరోగ్యాధికారులకు సహాయ సహకారాలందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణులు బీజింగ్‌కు చేరుకున్నారు.

- Advertisement -