బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

21

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ని కరీంనగర్ జైలుకు తరలించారు పోలీసులు.

సంజయ్‌తో పాటు కొర్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నాట్లు పోలీసులు తెలిపారు. 317 జీఓ పేరుతో బండి సంజయ్‌ ఆదివారం రాత్రి కరీంనగర్‌లో జాగరణ పేరుతో దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలను అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన దీక్ష చేపట్టారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్‌ పోలీసులు.