భారత టెక్కీలకు ఊరట…

291
h1b vissas
- Advertisement -

అమెరికాలోని భారత టెక్కీలకు ఊరట. హెచ్‌–1బీ వీసాల్లో ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. డిసెంబర్‌ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి.

ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి…. విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.

ఈ ఏడాది చివరి వరకు హెచ్‌–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌1–బీ వీసా విధానంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి.

- Advertisement -