దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా జమ్మికుంట…

57
jammikunta

దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డీ.జీ.పీ. ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలంచడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎంపిక చేస్తుంది.

ఈ 2020 సంవత్సరానికి గాను ఎంపిక చేసిన పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో కరీం నగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. కాగా, వరుసగా రెండవసారి కరీం నగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలవడం పట్ల డీ.జీ.పీ మహేందర్ రెడ్డి కరీం నగర్ కమీషనర్ వీ.బీ. కమల హాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారి తో పాటు ఈ ఘనతను సాధించిన ఇతర పోలీస్ అధికారులను అభినందించారు.

జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు దక్కిన ఈ పురస్కారం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. 2019 సంవత్సరం లో చొప్పదండి పోలీస్ స్టేషన్ 7 వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచింది.