అవినీతే టీఎంసీ ఓటమికి కారణం:ఓవైసీ

1
- Advertisement -

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలతో పూర్తిగా సంబంధాలు కోల్పోయారని, అవినీతి, పాలనా వైఫల్యాలు, ముస్లింలకు చేసిన అన్యాయమే పార్టీ ఎన్నికల ఓటమికి ప్రధాన కారణాలని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.

మీడియాతో మాట్లాడిన ఓవైసీ…మమతా బెనర్జీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించారని..వారిని సమాన హక్కులు కలిగిన పౌరులుగా చూడలేదని ఆరోపించారు.పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమికి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ఒక కారణం కావచ్చని అంగీకరించినప్పటికీ, భారీ అవినీతి, ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి మరింత ప్రభావం చూపాయని ఓవైసీ పేర్కొన్నారు. ముస్లింల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని అన్నారు.

ముస్లిం మహిళలు సహా రాష్ట్రంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ వారి జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ అంతర్గత విభేదాలు, నేతల తిరుగుబాట్లు, నాయకత్వంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read:చిరంజీవి-చరణ్..సంచలనం!

- Advertisement -