- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్,బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మంగళవారం లంగర్ హౌజ్ దర్గా ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పుట్టినరోజు గాని ఏ ఇతర శుభకార్యమైన పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు,జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు,టీఆర్‌ఆస్ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. వారంతా బాబా ఫసియుద్దీన్ శుభాకంక్షలు తెలిపారు.
- Advertisement -