కరోనా:బెంగళూరులో 6…కేరళలో 6 కొత్త కేసులు

390
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికి దేశ వ్యాప్తంగా 56 కేసులు నమోదుకాగా ఇవాళ బెంగళూరులో 6, కేరళలో మరో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 6 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌.

బాధితులను ఐసోలేషన్‌ వార్డుల్లో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపిన ఆయన రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 12 కు చేరిందన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు.. ఏడో తరగతి లోపు విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మిగితా క్లాసుల వారికి షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

బెంగళూరులో కొత్తగా 4 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్దారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -