షాకింగ్‌.. పాక్‌ జెర్సీపై ధోనీ పేరు..!

493
dhoni
- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ మైదానంలో దిగిన చాన్నాళ్లయింది. అభిమానులు అతడి విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా, ధోనీ ఎలా ఆడతాడన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఆడకపోయినా ఫ్యాన్స్‌కు అతడిపై మాత్రం అభినమానం తగ్గలేదు.

తాజాగా పాక్‌ చెందిన ధోనీ అభిమాని ఏకంగా పాకిస్తాన్‌ జెర్సీలో ధోనీ నెంబరు. 7 ఉన్న జెర్సీని ధరించి మ్యాచ్‌ చూడడానికి వచ్చాడు. అయితే అది ఎక్కడో జరగలేదు. పాక్‌ జరిగే పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పిఎస్‌ఎల్‌)లో జరిగింది. స్వయంగా అతనే తన ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రపంచంతో పంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

- Advertisement -