ఆర్ఆర్ఆర్ కు ఆ టైటిలే సరి..!

445
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా పాత్రలో అల‌రించ‌నున్నారు. అలాగే బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌, అలియా భట్‌,రే స్టీవెన్‌స‌న్‌, అల్లీస‌న్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని, ఒలీవియా మోర్రీస్‌ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

అయితే స్వాతంత్య్ర స‌మ‌రం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం అనే టైటిల్ సరిగ్గా స‌రిపోతుంద‌ని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అలోచిస్తోందట. ఈ చిత్రానికి సంబంధించి రాజ‌మౌళి మ‌రి కొద్ది రోజుల‌లో ఫ‌స్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కాబ‌ట్టి, ఆ రోజు చిత్ర టైటిల్‌తో పాటు చ‌ర‌ణ్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుదల‌వుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక హిందీలో ఈ సినిమాకి రామ రావ‌ణ రాజ్ అనే టైటిల్‌తో చిత్రాన్ని రిలీజ్‌ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది.

- Advertisement -