- Advertisement -
భారత్‌లో పంజా విసురుతోంది కరోనా రక్కసి. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. వరుసగా మూడో రోజు భారీగా కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 147 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,31,868కు చేరగా 3,867 మంది మృతిచెందారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 73,560కి ఎగబాకాయి. 54,440 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు.
ఇక తెలంగాణలో ఆదివారం కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 23 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోనివారు కాగా, రంగారెడ్డి జిల్లావారు ఒకరు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 11 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఆరుగురు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,854కు చేరింది.
- Advertisement -