టిక్ టాక్‌లోకి విరాట్ కోహ్లీ…!

71
virat kohli

కరోనా నేపథ్యంలో ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్ టాక్‌లో తెలుగు,హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.

తాజాగా అక్ష‌య్ కుమార్ న‌టించిన హౌజ్‌ఫుల్ 4 చిత్రంలోని బాలా.. సైతాన్ కా సాలా అనే సాంగ్‌కి త‌న‌దైన స్టైల్‌లో డ్యాన్స్ చేశాడు. ఇక వార్నర్‌ స్టెప్పులకి ఫిదా అయ్యారు విరాట్.

వార్నర్‌కు ఫన్నీ ఎమోజీని కామెంట్ రూపంలో పెట్టగా దీనికి రిప్లై ఇచ్చారు వార్నర్‌. అలాగే కోహ్లీని టిక్ టాక్ లోకి ఆహ్వానించిన వార్నర్… అనుష్క‌తో క‌లిసి డ్యూయ‌ట్ చేయ‌మ‌ని విరాట్‌ని కోరాడు. మరి దీనికి కోహ్లీ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.