కేంద్ర ప్రభుత్వ అధికారులుకు, సిబ్బందికి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల విభాగాలలోని పలువురు అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులుకు, సిబ్బందికి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది .
()కరోనా లక్షణం లేని సిబ్బందిని మాత్రమే కార్యాలయాలకు అనుమతించాలి.
()తేలికపాటి జలుబు / దగ్గు లేదా కంటైన్మెంట్ జోన్లో నివసిస్తున్న ఆఫీసర్లు / సిబ్బంది కార్యాలయానికి రాకూడదు
()20 కంటే ఎక్కువ మంది సిబ్బంది, అధికారులు కార్యాలయానికి హాజరుకాకూడదు
()కార్యాలయాల హాజరుకు రోస్టర్ విధానాన్ని ఫాలో అవ్వాలి
()మిగిలిన అధికారులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి
()కార్యాలయాల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి.
()కార్యాలయంలో ఏ సమయంలోనైనా 20 మందికి మించి ఉండటానికి లేదు.
()హాళ్ళలో సరైన వెంటిలేషన్ ఉండేలా వీలైనంతవరకు కిటికీలను తెరిచి ఉంచాలి.
()ఫేస్ మాస్క్ మరియు ఫేస్ షీల్డ్ అన్ని సమయాల్లో ప్రతి ఒక్కరు ధరించి ఉండాలి.
()నిబంధనల ఉల్లంఘనలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
సమావేశాలు / చర్చలు సాధ్యమైనంతవరకు నివారించాలి.
()ప్రతి అరగంటకొకసరి చేతులు కడుక్కోవడం తప్పనిసరి.
()
ఎలక్ట్రిక్ స్విచ్‌లు, డోర్ నాబ్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, వాష్‌రూమ్ ఫిక్చర్స్ వంటి తరచుగా తాకిన ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి