సీఎం కేసీఆర్‌కు జక్కన్న కృతజ్ఞతలు…

210
director rajamouli
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు దర్శకధీరుడు రాజమౌళి. తెలంగాణలో సినిమా,టీవీ షూటింగ్‌లు కొనసాగించడానికి సీఎం కేసీఆర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ ద్వారా ట్వీట్ చేసిన జక్కన్న….సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే విధి విధానాలు రూపొందించి సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కోవిడ్‌-19పై ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మా సినీ పరిశ్రమపై ఉందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు రాజమౌళి.

- Advertisement -