- Advertisement -
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇవాళ తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో అలర్ట్ ప్రకటించిన అధికారులు స్ధానికులెవరు బయటకు రావొద్దని సూచించారు. తిరుమల ఘాట్ రోడ్డులో బస్సులను అనుమతించడం లేదు.
ఏపీలో ప్రజాప్రతినిధుల జీతాల చెల్లింపును వాయిదా వేశారు. సీఎం దగ్గరి నుంచి సర్పంచ్ వరకు అందరి జీతాలు వాయిదా పడగా అధికారుల జీతాల్లో స్ధాయిల వారిగా కోత విధిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో ఇప్పటివరకు 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- Advertisement -