ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుండి వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న బాధితుడు గత నాలుగు రోజులుగా నెల్లూరులోని ప్రభుత్వ హాస్పిటల్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఆ యువకుడి రక్త నమునాలను సేకరించిన వైద్యులు కరోనా ఉన్నట్లు గుర్తించారు.
రెండో విడత పరీక్షల కోసం బాధితుడి రక్తనమూనాలను పుణెకు పంపించారు. ప్రస్తుతం నెల్లూరు హాస్పిటల్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులతో పాటు ముందు జాగ్రత్తగా బాధితుడి నివాస ప్రాంతం చిన బజారులో ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇక ఇప్పటివరకు దేశంలో 60 మందికి కరోనా సోకినట్లు గుర్తించగా వారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 4 వేల మందికిపైగా చనిపోగా లక్షల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నారు. 100 దేశాలకి పైగా కరోనా వైరస్ వ్యాపించింది.