కోవిడ్ సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు నిలువునా దోపిడి చేస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజా కరోనా చికిత్స, వైద్య పరీక్షలు, అంబులెన్సు చార్జీలకు గరిష్ఠ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చార్జీలపై వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబరు 40 జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా రూ.4 వేలు, ఐసీయూ వార్డులో గరిష్ఠంగా రూ.7,500, వెంటిలేటర్ తో కూడిన ఐసీయూ గది చికిత్సకు గరిష్ఠంగా రూ.9 వేలు మాత్రమే ఛార్జ్ చేయాలని ఆదేశించింది. పీపీఈ కిట్ ధర రూ.273 మించరాదని చెప్పింది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు..
సాధారణ అంబులెన్సుకు కనీస చార్జీ రూ.2 వేలు
హెచ్ఆర్సీటీ-రూ.1,995
డిజిటల్ ఎక్స్‌రే- రూ.1,300
డీ డైమర్ పరీక్ష-రూ.300
సీఆర్పీ-రూ.500
ప్రొకాల్ సిటోనిన్-రూ.1,400
ఫెరిటిన్-రూ.400
ఎల్డీహెచ్-రూ.140