దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ దిల్లీలో మాత్రం గత కొద్ది రోజులుగా నిత్యం రెండు వేలకు పై గానే వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్లు లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. కొంత మందిలో అత్యంత వ్యాప్తి కలిగిన ఉపవేరియంట్ బీఏ 2.75ను గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డా.సురేశ్ కుమార్ తెలిపారు. ఈ వేరియంట్ యాంటీబాడీలు ఉన్నవారిలోనూ టీకాలు తీసుకున్నవారిపైనా ప్రభావం చూపుతుందని డా.సురేశ్ పేర్కొన్నారు. అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ 2.75ను గుర్తించాం. టీకాలు తీసుకున్నవారిపైనా యాంటీబాడీలు ఉన్నవారిపైనా ఈ ఉపవేరియంట్ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దిల్లీలో మంగళవారం 2,445 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత ఫిబ్రవరి నుంచి దిల్లీలో ఇవే అత్యధిక కేసులు. దీంతో పాజిటివిటీ రేటు 15.41శాతానికి చేరింది. వైరస్‌తో ఏడుగురు మృతిచెందారు.
దిల్లీలో కరోనా కొత్త వేరియంట్…
- Advertisement -
- Advertisement -