కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభ లెక్కలు, ఎన్పీఆర్‌ని వాయిదా వేయాలని భావిస్తోంది కేంద్రం. ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఎన్పీఆర్‌తో పాటు జనాభలెక్కల ప్రక్రియను వాయిదా వేసే ఆలోచనలో ఉంది.
జన సమూహాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఎన్‌పీఆర్ డేటా సేకరణను ఆపేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా,ఢిల్లీలో ఎన్‌పీఆర్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరాయి.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎపిడమిక్ అలర్ట్ ప్రకటించిందని, అలాంటి సమయంలో ఇంటి ఇంటికి వెళ్లి జనాభా లెక్కల సేకరణ చేపట్టడం సాధ్యం కాదు అని సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా వివేక్ జోషి తెలిపారు.
ఇక ఎన్పీఆర్‌ని ఢిల్లీతో పాటు 60 శాతం దేశ జనాభా ఉన్న 13 రాష్ట్రాలు ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఎన్‌పీఆర్ కోసం తయారు చేసిన ఫార్మాట్ సరిగాలేదనిపలు రాష్ట్రాలు తీర్మానాలు కూడా చేశాయి.