సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కరోనా కలకలం..

44
medaram

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా అక్కడక్కడ కొన్ని కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కరోనా కలకలం రేపింది. ఇద్దరు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రేపటి నుంచి 21 రోజులపాటు ఆలయాన్ని మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేడారం చిన్నజాతర (మండమెలిగే పండుగ) సమయంలో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలిసింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా గత బుధవారం ప్రారంభమైన మేడారం చిన్నజాతర (మండల మెలిగె పండుగ) నిన్న ముగిసింది.