సమంత వదిలిన సాయిపల్లవి‌ సాంగ్‌..

59
Samantha

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 16న సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా ఆదివారం ఈ సినిమాలో ‘సారంగ దరియా…’ లిరికల్‌ సాంగ్‌ను సమంత అక్కినేని విడుదల చేశారు.

మంగ్లీ పాడిన ‘సారంగ దరియా’ అనే మాస్ బీట్‌కు సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ పాట‌తో పాటు సాయి ప‌ల్లవి ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని చూపించనున్నారు. చైతు , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు.

#SarangaDariya​ | Lovestory Songs | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch