మొక్కజొన్నను చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఉడకబెట్టి లేదా కాల్చుకొని స్నాక్స్ గా తింటూ ఉంటారు. ఇంకా మొక్క జొన్న పిండితో చేసుకునే వంటకాలు అనేకం. ఇలా ఏదో ఒకరకంగా మనం డైలీ తినే ఆహార పదార్థాలలో మొక్క జొన్న పాత్ర కచ్చితంగా ఉంటుంది. కాగా మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కేవలం మొక్కజొన్నలో మాత్రమే కాకుండా మొక్కజొన్న పీచులో కూడా పోషకాలకు కొదువేమీ ఉండదు. మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మొక్కజొన్న పీచుతో ప్రతిరోజూ టీ చేసుకొని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మనం ప్రతిరోజూ తాగే టీలో టీ పౌడర్, షుగర్, పాలు వంటివి వాడుతూ ఉంటాము. టీ పౌడర్ కు బదులుగా మొక్కజొన్న పీచును వాడితే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మొక్కజొన్న పీచుతో చేసిన టీ తాగడం వల్ల కిడ్నీలో ఉండే టాక్సీన్లు, నైట్రిన్ లు బయటకు పోవడంతో పాటు కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. ఈ పీచు లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల కొందరిలో మూత్ర విసర్జన చేసే టైమ్ లో వచ్చే మంట, నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. మొక్క జొన్న పీచులో ప్రోస్టేట్ గ్రంధికి మేలు చేసే గుణాలు ఉంటాయట. అందువల్ల మన శరీరంలోని వ్యర్థాలను బయ్తకు పంపడంలో ఈ పీచు ఎంతగానో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీర్ణ క్రియను మెరుగు పరచడంతో పాటు మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందట. అందుకే ప్రతిరోజు సాధారణ టీ తాగే బదులు మొక్కజొన్న పీచుతో చేసిన టీ తాగితే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నా మాట.
Also Read: తమలపాకుతో.. జుట్టు స్ట్రాంగ్!