సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఇక ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా యుఎస్‌లో మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం యుఎస్‌లో 110కి పైగా లొకేషన్స్ లో ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఏకంగా లెక్క ఆల్రెడీ లక్ష డాలర్స్ దాటి 1 లక్ష 20 వేలుకి చేరినట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
Also Read:సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం!

