సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మరియు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన వార్ 2 ఆగస్టు 14న భారీ అంచనాల నడుమ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఉండగా రెండు సినిమాలు మంచి వసూళ్లనే రాబట్టాయి.
అయితే బాక్సాఫీస్ వార్‌లో కూలీదే పైచేయిగా నిలిచింది. రెండో రోజు (శుక్రవారం), వార్ 2 7.45 లక్షల (745.05K) టికెట్లు అమ్మి, 6.89 లక్షల (689.02K) టికెట్లు అమ్మిన కూలీని 24 గంటల్లో బుక్ మై షోలో దాటింది. అయితే, మూడో రోజు (శనివారం)కి వస్తే, తాజా అప్డేట్స్ ప్రకారం కూలీ 12.55 వేల టికెట్లు అమ్మి ముందంజలో ఉండగా, వార్ 2 మాత్రం 9.61 వేల టికెట్లు మాత్రమే విక్రయించింది.
కూలీ 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేయగా వార్ 2 రెండో రోజుకే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
Also Read:కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోట్ల నగదు!

