- Advertisement -
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈడీ అధికారులు జరిపిన దాడుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోట్ల నగదు, కిలోల బంగారం బయటపడింది.
కర్ణాటక జిల్లా ఉత్తర కన్నడ జిల్లా కారవార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ శైల్ ఇంటిపై దాడి చేసి కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. గతంలో ఐరన్ ఓర్ అక్రమ తరలింపు కేసులో సతీశ్‌కు, ఏడేళ్ల జైలు శిక్ష, రూ.9 కోట్లు జరిమానా వేసిన ప్రజాప్రతినిధులు కోర్టు, ఈ శిక్షను నిలిపివేసింది కర్ణాటక హైకోర్టు.
Also Read:అలస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ..
ఈ కేసుకు సంబంధించి ఇటీవల జరిగిన దాడుల్లో రూ.1.68 కోట్ల నగదు, 6.750 కిలోల బంగారం, రూ.14 13 కోట్లు ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకొని జప్తు చేశారు ఈడీ అధికారులు.
- Advertisement -

