బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..

5
- Advertisement -

ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 21తో నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది. ఉపరాష్ట్రపతి రేసులో పలువురు ప్రముఖులు ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై కూడా నిర్ణయం తీసుకున్న ఛాన్స్ ఉంది.

ఆగస్టు 4న ఆరోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్కర్. ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులే కాకుండా నామినేట్ చేసిన ఎంపీలు కూడా ఎన్నుకుంటారు. ఈ రెండు సభల్లో కలిపి 781 మంది సభ్యులు ఉంటారు. పూర్తి స్థాయి ఓటింగ్ జరిగితే గెలవాలంటే కనీసం 391 ఓట్లు అవసరం.

ఎన్‌డిఎ కూటమికి సుమారు 422 మంది ఎంపీల మద్దతు ఉండటంతో ఎన్డీఏ అభ్యర్థి ఎన్నిక లాంఛనం కానుంది. ఎన్నికల కమిషన్ ప్రకటన ప్రకారం నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21. ఆగస్టు 22న పరిశీలన జరుగుతుంది. ఆగస్టు 25 ఉపసంహరణకు చివరి తేదీ.

Also Read:బర్త్ డే గిఫ్ట్‌గా యూరియా బ్యాగ్!

- Advertisement -