సాధారణంగా వంట గ్యాస్ ధర ఒక్క రూపాయి పెరిగిందటనే చాలు.. ఆగ్రహ జ్వాలలు ఉగ్రరూపం దాల్చి జనం గగ్గోలు పెడతారు. కానీ ఏకంగా వంట గ్యాస్ ధర వేలకు వేలు పెరిగితే ఏంటి పరిస్థితి.. ఇంకేముంది అంటారా?… ఇక రచ్చ రచ్చే.. కదా.. కానీ ఇక్కడ మాత్రం గ్యాస్ ధర వేల రూపాయలు ఉన్నాజనం మాత్రం ప్లాస్టిక్ కవర్లలో గ్యాస్ ను నిల్వ చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంతకు ఇది ఎక్కడునుకుంటున్నారా?… మన దాయాది దేశం పాకిస్తాన్లో… అవును పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో దేశం ఛిన్నాబిన్నమవుతోంది. ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనం అవస్థలు చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండెలు అవిసిపోవాల్సిందే. జనం గ్యాస్ ధర పెరగడంతో ఏకంగా ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా… వంట గ్యాస్ ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి.
ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ లోని హంగూ నగరంతో పాటు ఖైబర్, ఫఖ్తుంక్వా జిల్లాలతో పాటు కరక్ జిల్లా ప్రజలు గత రెండేళ్లుగా గ్యాస్ కనెక్షన్లు లేకుండానే జీవిస్తున్నారు. అందుకే గ్యాస్‌ని ఈవిధంగా ప్లాస్టిక్ కవర్లో నింపుకోవడం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, మీడియాలో వస్తున్న వార్తలపై పాక్ ప్రభుత్వం స్పందించింది.